
పాన్డోరా పుణ్యమా అని లోకంలోకి రోగాలు, దుర్మార్గాలు చెరిపోయాయి. మరో వైపు జియుస్ ని దేవతలందరు ప్రాధేయపడటంతో అతను Prometheous ని తన శిక్ష నుండి విడుదల చేశాడు. స్త్రీ రాకతో ప్రపంచంలో మానవ జీవితం మొదలయ్యింది. మనుషులు జత కట్టడం, పిల్లల్ని కనడం, కుటుంబ బంధాలు, రాజ్యాలు, రాజులు, పట్టణాలు, పాలన, అన్నీ మొదలయ్యాయి. Pandora మరియు Epimetheous లకు కూడా పిల్లలు పుట్టారు. వారికి పుట్టిన పిల్లలలో ఒకరు PYRRHA, వారి కూతురు, మరియు మనం చెప్పుకుంటున్న ఈ కథలో ముఖ్య పాత్రధారి. మరోవైపు Prometheous కి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు DEUCALION. తన తోబుట్టువుతో, మరియు తన కొడుకుతో సంతోషంగా తాను సృష్టించిన మనిషి ఎదుగుదల చూస్తూ జీవిస్తున్న Prometious మనసులో, ఏదో ఒక రోజు మనిషి ఎదగడం చూసి జియుస్ కి ఈర్ష్య కలిగి, వారికి హాని కలిగించవచ్చెమొ అన్న అనుమానం మొదలయ్యింది. ముందు జాగ్రత్తకి తాను తన కొడుకుని అడవిలోకి తీసుకు వెళ్ళి అతనికి అత్యవసరమైన సమయంలో బ్రతకడానికి అవసరమైన చేతిపానులన్నీ నేర్పడమేకాక, తండ్రి కొడుకు కలిసి, మనుషులు బ్రతకడానికి సరిపోయేంత పెద్ద చెక్క పెట్టేని సృష్టించారు. అందులో కొన్ని సంవత్సరాలకు సరిపడా సరుకులు సర్ది, ఆ పెట్టెని జాగ్రత్తగా దాచిపెట్టారు. వయసుకొచ్చిన DEUCALION మరియు PYRRHA ఒకరిని ఒకరు ఇష్టపడటంతో, వారిద్దరికీ సంతోషంగా పెళ్లి చేశారు Prometheous అండ్ Epimetheous.