
తనకంటూ ఒక తోడు, ప్రేమ కోరుకున్న గాయా, తాను ఎవరిని తన భర్తగా ఎన్నుకోవాలి అని ఆమెలో సంగధిత కలిగినప్పుడు ఆమె మనసులో ఇద్దరు మెదిలారు. ఆమె నుండి ఉద్భవించిన ఆ ఇద్దరిలో ఒకరు pontus, మహా సముద్రానికి అధిపతి, ఎప్పుడు ఆవేశం తో అలలతో ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాడు. మరొకరు Uranus, స్వర్గానికి మరియు ఆకాశానికి అధిపతి, ప్రశాంతంగా భూమి అంతటికీ నీడనిస్తూ, సున్నితంగా సహనంతో ఉంటాడు. Uranus లో ఉన్న సహనాన్ని, సున్నితత్వాన్ని గాఢంగా ఇష్టపడిన గాయా, అతన్ని తన భర్తగా ఎన్నుకుంది.