
శ్రీమద్భగవద్గీత లోని 18 అధ్యాయములలో మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము. ఈ అధ్యాయములో అర్జునునకు కలిగిన విషాదము(దుఃఖము) స్వార్ధముతో కూడినది కాదు. ధర్మము తమ వైపు ఉన్నప్పటికి, తాతలను, పినతండ్రులను. మేనమామలను, గురువులను, అన్నదమ్ములను, కొడుకులను, మనుమలను,మిత్రులను యుద్దములో సంహరించి, రాజ్యము పొందుట కన్నా యుద్ధము మానివేయుట శ్రేయస్కరమని తలచెను. బంధువులైన కౌరవులపైన అస్త్రములను ప్రయోగించుటకు మనసురాక, ధనుర్భాణములను వదలివేచి యుద్ధరంగమున విషాదముతో కూలబడెను. అట్టి స్థితిలో ఉన్న అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు గీతను బోధించి, ధర్మపథమున నడిపించెను. మానవ జీవితంలో ప్రతివారికి కూడా ఎప్పుడో ఒకప్పుడు అటువండి ధర్మసంకటము ఏర్పడుట సహజము. భగవద్గీత మానవ జీవన ప్రయాణం లో భగవద్గీత ఒక చక్కని మార్గాన్ని చూపే కర దీపిక.
విషాద యోగము, 1 వ భాగము...
1. కౌరవ సేన మరియ పాండవ సేన లోని వీరుల గురించిన వర్ణన ( 1 వ శ్లోకమునుండి 11 వ శ్లోకము వరకు)
2. వారియొక్క శంఖముల పేర్లు, వారి శంఖ నాదములు ( 12 వ శ్లోకమునుండి 19 వ శ్లోకము వరకు)
3.అర్జునుడు ప్రతిపక్షమున ఉన్నబంధువులను,గురువులను, ఆప్తులను పరికించుట ( 20వ శ్లోకమునుండి 27
వ శ్లోకము వరకు)