Home
Categories
EXPLORE
True Crime
Comedy
Business
Sports
Society & Culture
Health & Fitness
TV & Film
About Us
Contact Us
Copyright
© 2024 PodJoint
00:00 / 00:00
Sign in

or

Don't have an account?
Sign up
Forgot password
https://is1-ssl.mzstatic.com/image/thumb/Podcasts112/v4/6b/93/f2/6b93f25d-4a43-d8de-6fe5-4344a1a00e53/mza_11076412984410097003.jpeg/600x600bb.jpg
The New City Church Podcast - Telugu
New City Church
99 episodes
4 days ago
Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Website: https://www.newcity.in
Show more...
Christianity
Religion & Spirituality
RSS
All content for The New City Church Podcast - Telugu is the property of New City Church and is served directly from their servers with no modification, redirects, or rehosting. The podcast is not affiliated with or endorsed by Podjoint in any way.
Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Website: https://www.newcity.in
Show more...
Christianity
Religion & Spirituality
Episodes (20/99)
The New City Church Podcast - Telugu
Principles for Advancing & Possessing - ముందుకు సాగి స్వాధీనపరచుకొనుటకు సూత్రములు
ఒక విశ్వాసి తన జీవితములో ముందుకు సాగి స్వాధీనపరచుకొనుట అంటే ఏమిటి? 2026లోని మొదటి బ్రేక్త్రూ ఆదివారాన బోధింపబడిన ఈ ప్రభావవంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడు విశ్వాసులమైన మనకొరకు ఉంచిన వాటన్నిటినీ మనము సొంతం చేసుకోవడానికి మనలను బలపరిచే ఆత్మీయ సూత్రాలను పంచుకుంటున్నారు. ఆత్మీయ ఎదుగుదల, స్పష్టత మరియు నిరంతర అభివృద్ధికి మూలమైన దేవుని వాక్యాన్ని ధ్యానించుట యొక్క కీలకమైన పాత్రను వారు ఇక్కడ నొక్కి చెబుతున్నారు.  ఈ సందేశము మీ ఆత్మీయ దర్శనాన్ని బలోపేతం చేసి, దేవుని వాక్యం పట్ల మీ నిబద్ధతను మరింత పెంచి, జీవితంలోని ప్రతి రంగంలోనూ ముందుకు సాగి, దేవుడు మీకై ఉంచిన వాటన్నిటినీ స్వాధీనపరచుకొనుటకు మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. దేవుని వాగ్దానాలను విని, ధ్యానించి, వాటిలో ధైర్యంగా ముందుకు నడవండి.
Show more...
1 day ago
1 hour 15 minutes

The New City Church Podcast - Telugu
Receiving the Fullness of Christ - క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?
క్రీస్తు పరిపూర్ణతలో జీవించుట అంటే ఏమిటి? ‘క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తు పరిపూర్ణత అంటే సంపూర్ణ విమోచన అని వివరిస్తున్నారు. వారు ప్రతి విశ్వాసి జీవితములో పాపము నిర్మూలించబడిందని వెల్లడిస్తూ నూతన నిబంధన క్రింద మన రక్షణ నిమిత్తము శాశ్వతంగా పూర్తి వెల చెల్లించిన క్రీస్తు రక్తము యొక్క ప్రత్యేకతను నొక్కి చెబుతున్నారు.  విశ్వాసులు నూతన నిబంధన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని మరియు క్రీస్తు పూర్తి చేసిన కార్యము ప్రకారంగా మన మనసులను రూపాంతరపరచుకుంటూ ఉండాలని పాస్టర్ బెన్ గారు మనలను పురికొల్పుతున్నారు. ఈ సందేశము మీ గుర్తింపునకు స్పష్టతను తీసుకువస్తుంది, మీ నిశ్చయతను బలపరుస్తుంది మరియు మీ ఆలోచనా విధానాన్ని నూతన నిబంధన సత్యానికి అనుగుణంగా మారుస్తుంది.  ఈ వాక్యాన్ని విని, స్వీకరించి, ప్రతి రోజు క్రీస్తు యొక్క సంపూర్ణతలో నడవండి.
Show more...
1 week ago
1 hour 37 minutes

The New City Church Podcast - Telugu
[Bilingual] Grand Christmas Miracle Service
అద్భుతాలకు మీ సమయమిదే. ఈ క్రిస్మస్ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు క్రీస్తు యొక్క అద్భుత జననాన్ని గుర్తు చేస్తూ, విశ్వాసులు అద్భుతాలలో నడచుటకున్న దీవెనను గురించి తెలుపుతున్నారు.  క్రీస్తు శతృవు యొక్క కార్యాల మీద విజయాన్నెలా పొందాడో తెలుసుకొని, మీ ఆరోగ్యము, కుటుంబము, ఆర్ధిక విషయాలు, వృత్తి, పరిచర్య ఇంకా మరిన్ని రంగాలలో అద్భుతాలను చూచుటకు విశ్వాసంతో వాక్యాన్ని స్వీకరించండి! మీ దృష్టిని దేవుని వాక్యము పై నిలిపి ఈ మసకబారిన లోకములో ప్రకాశమానమైన అద్భుతము వలె ఉంటూ, ప్రజలను క్రీస్తు వైపునకు నడుపుదురు గాక!
Show more...
1 week ago
56 minutes

The New City Church Podcast - Telugu
Created for the Miraculous - అద్భుతములు
అద్భుతాలు అరుదుగా జరుగుటకు ఉద్దేశించబడ్డాయా లేదా అవి విశ్వాసులకు రోజువారీ వాస్తవికతగా ఉండాలా? ‘అద్భుతములు’ అను ఈ శక్తివంతమైన సందేశంలో, దేవుని రాజ్యంలో అద్భుతాలు ఏదో అప్పుడప్పుడు జరిగే సంఘటనలుగా, మన జీవితాల్లోని కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైనవిగా ఉండకూడదు కానీ ప్రతి రోజూ విశ్వాసులు తమ జీవితాల్లోని ప్రతి రంగములో అనుభవిస్తూ ఉండాల్సినవైయుండాలని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తున్నారు. అద్భుతాల కొరకు మనమెందుకు పోరాడాలి అనేదానికి బలమైన వాక్యాధారిత కారణాలను, అద్భుతాలకు వ్యతిరేకంగా ఈ కాలములో ఉన్న అపోహలను మరియు దేవునిని నిజంగా విశ్వసించే ప్రతి ఒక్కరినీ అద్భుతాలు ఎందుకు అనుసరించాలో అనే విషయాన్ని గురించి పాస్టర్ గారు ఈ ప్రసంగము ద్వారా స్పష్టమైన లేఖనాత్మక అవగాహనను మనకు ఇస్తున్నారు.  ఈ వర్తమానము మీ ఆలోచనా విధానాన్ని సవాలు చేసి, మీ విశ్వాసాన్ని బలపరచి, దేవునికి మీకై అద్భుతాల కొరకు ఉన్న ప్రణాళికలోనికి మిమ్మల్ని త్రిప్పి నడిపిస్తుంది.  ఈ వాక్యాన్ని విని, ప్రేరేపింపబడి, మీరు దేని కోసమైతే సృష్టించబడ్డారో ఆ వాస్తవికతలో ప్రతిరోజూ నడవండి.
Show more...
2 weeks ago
1 hour 13 minutes

The New City Church Podcast - Telugu
Created for Good Works - సత్కార్యముల కొరకు సృష్టింపబడితిమి
మీరు క్రైస్తవులా? అయితే, మీ విశ్వాసాన్ని మీ జీవితములో ఎలా కనపరుస్తారు? ఇతరులను నిందించుటకు తొందరపడుతుంటారా?  ట్రాఫిక్లో తొందరగా చిరాకుపడిపోతుంటారా? ఎప్పుడూ స్వీయ జాలితో కుమిలిపోతుంటారా? మీ ఆర్ధిక విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారా? అలా అయితే, మీరు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న ఆ విశ్వాసాన్ని నిశితంగా పరిశీలించాల్సిన సమయమిదే. ఈ కనువిప్పు కలిగించే ప్రసంగములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన పనులకు, మాటలకు, ఆలోచనలకు, డబ్బును వాడే విధానానికి పర్యవసానాలుంటాయని, మంచి కార్యాలకు మంచి ప్రతిఫలము, చెడు కార్యాలకు చెడు ప్రతిఫలము ఉంటుందని విశ్వాసులకు గుర్తుచేస్తున్నారు. మంచి కార్యాలు చేయుటకే కృప మనకు అనుగ్రహించబడింది.  మీ విశ్వాసానికి, మీ కార్యాలకు మధ్య పొంతన లేదని మీరు ఒప్పింపబడుతుంటే, ఈ రోజే దానిని మార్చుకొనుటకు ఈ సందేశము మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. మీ మంచి కార్యాలు విస్తరించి, లోకములోని అన్యులు క్రీస్తు వైపునకు త్రిప్పబడుదురు గాక. ఆమేన్!
Show more...
3 weeks ago
1 hour 22 minutes

The New City Church Podcast - Telugu
Faith, Works & Rewards - విశ్వాసము, క్రియలు, ప్రతిఫలములు
స్పష్టమైన ఫలితాలను ఉత్పత్తి చేసే నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగియుండుట అంటే ఏమిటి? విశ్వాసులను బలపరిచే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసము, వాక్యాధారిత క్రియల మధ్య ఉన్న క్రియాశీలక సంబంధాన్ని గురించి తేటగా తెలియజేస్తున్నారు.  ప్రతీ విశ్వాసి తన విశ్వాసము మృతమైపోకుండా అది పరిపూర్ణమగునట్లు, తన విశ్వాసపు మంటను తప్పక ఎలా రగిలిస్తూ ఉండాలో ఇక్కడ కనుగొనండి. స్వచ్ఛమైన విశ్వాసము క్రియల ద్వారా ఎలా విశదమవుతుందో మరియు ఉద్దేశపూర్వకంగా చేసే క్రియలు దేవుని వాగ్దానాలను పొందుకునే స్థానములోనికి మిమ్ములను ఎలా తీసుకువచ్చి దేవుడు మీ కొరకు ఉంచిన ప్రతిఫలాలన్నిటినీ పొందుకొనుటకు ఎలా కారణమవుతాయో తెలుసుకోండి.  మీరీ వర్తమానాన్ని వింటూండగా, మీ హృదయం మీ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి, మీ కార్యాలను బలోపేతం చేయడానికి మరియు మీ జీవితానికై దేవుడు కోరుకునే ప్రతిఫలాల్లోనికి ధైర్యంగా మిమ్ములను నడపడానికి ప్రేరేపించబడును గాక!
Show more...
4 weeks ago
1 hour 14 minutes

The New City Church Podcast - Telugu
The Grace, The Race & The Reward - కృప, పందెము ప్రతిఫలము
మీరు జీవితములో స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుందా? మీ సామర్థ్యాన్నికనుగుణంగా నిజంగా మీరు జీవిస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారా? కనువిప్పు కలిగించే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడనుగ్రహించిన బహుమతులను సద్వినియోగం చేసుకొని, మీపైయున్న ప్రత్యేకమైన దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చుట ఎలాగో బోధిస్తూండగా వినండి. అలాగే, మీ స్వంత పందెముపై దృష్టి నిలిపి, ఇతర విషయాలచే మరల్చబడకుండా, మీ పనిని చక్కగా పూర్తి చేసినందుకై ఎలా ప్రతిఫలాలను పొందవచ్చో నేర్చుకొనండి.  ప్రతిఫలాలు, బహుమతుల మధ్య ఉన్న వాక్యానుసారమైన భేదాన్ని కనుగొని, మీ పందెమును శ్రద్ధతో ఉద్దేశ్యపూర్వకంగా పరుగెత్తుటకు సిద్దపడండి. లెక్క అప్పజెప్పాల్సిన వారిగా బాధ్యతాయుతులమై దేవుని కృపను సద్వినియోగం చేసుకుందాం.
Show more...
1 month ago
1 hour 11 minutes

The New City Church Podcast - Telugu
Lifestyle of Thanksgiving - కృతజ్ఞతతో కూడిన జీవనశై
ఒక విశ్వాసిగా మీరు కృతజ్ఞత కలిగిన హృదయమనే వాస్తవికతలో నిజంగా నడుస్తున్నారా? గొప్ప పరివర్తన కలిగించే ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కాలానుగుణమైన లేక పరిస్థితులాధారితమైనది కాక ప్రాథమికమైనదిగా మనము కలిగియుండాల్సిన కృతజ్ఞత జీవనశైలి యొక్క లోతు మరియు శక్తిని మన కొరకు వెలికితీస్తున్నారు.  ఈ సందేశములో ప్రతి విశ్వాసి జీవితంలో కృతజ్ఞత ఎందుకు ఆవశ్యకమో మరియు అది దేవునితో మీ నడకను ఎలా రూపుదిద్దుతుందో కనుగొనండి. కృతజ్ఞత యొక్క ముఖ్య అంశాలను నేర్చుకొని, నిరంతరం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండుట దేవుని మంచితనాన్ని మరింత స్పష్టంగా చూడటానికి మిమ్మల్ని ఎలా సరి ఐన స్థానములో ఉంచుతుందో అర్థం చేసుకోండి. మీరు ఈ వాక్యాన్ని వింటూండగా, మీ హృదయము అనుదిన కృతజ్ఞతను అలవరచుకొనుటకు ప్రేరేపించబడి, ఈ సందేశములో దేవునికై కృతజ్ఞత కలిగిన జీవనశైలిని నిజముగా జీవించుటకు ఇవ్వబడిన ఆచరణాత్మక విధానాలను మీరు స్వీకరించుదురు గాక. 
Show more...
1 month ago
52 minutes

The New City Church Podcast - Telugu
The Judgement Seat of Christ - క్రీస్తు న్యాయపీఠం
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుటకు మీరు సంతోషంతో వేచి చూస్తున్నారా లేక ఆందోళనలో ఉన్నారా? పరిణితి చెందిన విశ్వాసుల కొరకైన ఈ కనువిప్పు కలిగించే సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నూతన నిబంధన విశ్వాసులు దేవుని బహుమానాలు మాత్రమే కాదు కానీ, క్రీస్తు న్యాయపీఠము వద్ద మన కొరకు వేచియున్న ప్రతిఫలాలను పొందుకొనే జీవితాన్ని జీవించే బాధ్యత మనకుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు  మీ ప్రతి మంచి పనికి సమృద్ధిగా ప్రతిఫలం పొందుటకు క్రీస్తు ఎదుట సంతోషముతో నిలబడియుందురు గాక!
Show more...
1 month ago
1 hour 15 minutes

The New City Church Podcast - Telugu
Revelation of the Zoe Life - దేవుని జీవం (Pastor Arpitha Komanapalli)
మీలో ఉన్న క్రీస్తు జీవము అనే సర్వ సత్యములో మీరు నడుస్తున్నారా? ఈ శక్తివంతమైన సందేశంలో, క్రీస్తు నుంచి మనము పొందుకున్న జోయే – దేవుని వంటి జీవము – అనే ప్రత్యక్షతను పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు మనకు చూపిస్తున్నారు.  సమాచారము మరియు ప్రత్యక్షత మధ్య తేడాలను కనుగొని, సహజ ప్రపంచానికి మించిన సహజాతీతమైన ప్రపంచములోనికి ఎలా చూడగలమో ఈ వర్తమానంలో తెలుసుకొనండి. శతృవు మారువేషము ధరించి మిమ్మల్ని ఇక ఏ మాత్రమూ మోసపరచనివ్వకండి. సిలువపై ఆయన పూర్తిచేసిన కార్యము ద్వారా మీరు క్రీస్తు జీవాన్ని పొందారు.  మీరీ సందేశాన్ని వింటూండగా మీ మనోనేత్రములు వెలిగింపబడి, జీవానికే మూలమైన యేసు క్రీస్తు అనే దృఢమైన బండ మీద స్థిరంగా నిలబడియుందురు గాక!
Show more...
1 month ago
1 hour 15 minutes

The New City Church Podcast - Telugu
The Simplicity in Christ - క్రీస్తులోని సరళత
మంచి ఆరోగ్యము, సఫలవంతమైన సంబంధాలు, తృప్తినిచ్చే ఉద్యోగము లేదా సేవా పరిచర్య కలిగియుండుట చాలా కష్టం అనిపిస్తుందా? ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులోని సరళత ద్వారా ఈ ఆశీర్వాదాలన్నిటినీ మనము సుళువుగా ఆస్వాదించే రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. ఈ వర్తమానంలో నూతన నిబంధన పాత నిబంధనను ఎలా  అధిగమిస్తుందో, ఈ రెండింటినీ కలపడం వల్ల కలిగే ప్రమాదాలను మనము కనుగొంటాము మరియు దేనినైనా పొందుకొనుటకు దేవుని కృప, మన విశ్వాసమే కీలకమని  నేర్చుకుంటాము.  మీ పనులు సులభతరమవుతే, మీ విశ్వాసము హెచ్చవుతుంది. అప్పుడు ఆశీర్వాదాలు మెండవుతాయి. 
Show more...
2 months ago
1 hour 11 minutes

The New City Church Podcast - Telugu
Wealth Transfer - సంపద బదిలీ
దేవుని రాజ్యములోనికి, విశ్వాసుల జీవితాల్లోనికి ధనము ఎలా ప్రవహించాలో అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సంపద బదిలీని గురించిన మర్మాన్ని, లోకస్థుల చేతుల్లో నుంచి, తన బిడ్డల చేతుల్లోనికి దేవుడు వనరులను వ్యూహాత్మకంగా ఎలా మారుస్తాడో  ఈ శక్తివంతమైన సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తూండగా వినండి.  ఈ వర్తమానంలో, మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు:•⁠  ⁠సంపద బదిలీ జరిగే 3 విధానాలు: వ్యూహము ద్వారా, విడుదల ద్వారా, బలవంతముగా.•⁠  ⁠దుష్టులు మరియు నీతిమంతుల మీద ఈ 3 విధానాల ప్రభావము.•⁠  ⁠విశ్వాసులు, దుష్టులు మరియు దేవుడు ఎలా ఈ సంపద బదిలీ జరిగే ప్రతి విధానాన్ని నిర్ణయిస్తారు?•⁠  ⁠దేవుని రాజ్య సంపదను బలోపేతం చేసే జ్ఞానపు 5 కోణాలు.•⁠  ⁠పాపాత్ముడు పోగు చేసినదానంతటితో సహా ఒక మంచి వ్యక్తి ఎలా ఙ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని పొందుకుంటాడు? మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని రాజ్యపు సంపదను గురించి మీకున్న జ్ఞానము పెరిగి, నమ్మకమైన గృహనిర్వాహకునిగా ఉండుటకు మీరు దైవిక జ్ఞానములో ఎదుగుతూ గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక!
Show more...
2 months ago
1 hour 24 minutes

The New City Church Podcast - Telugu
The Parable of the Talents - తలాంతుల యొక్క ఉపమానము
ఆర్థికంగా మరో మెట్టుకు ఎదగాలనుకుంటున్నారా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మరింతగా చేయాలని కోరుతున్నారా? అయితే, ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తలాంతుల యొక్క ఉపమానము ద్వారా ఆర్థిక విషయాలను గురించిన కాలాతీతమైన వాక్య జ్ఞానాన్ని పంచుకుంటూండగా వినండి.  మీరీ సందేశాన్ని వింటూండగా మీ వనరులను జ్ఞానయుక్తంగా నిర్వహిస్తూ దేవుని రాజ్యంలో ధారాళంగా పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రేరణ పొందాలని మా ప్రార్థన. మీరు అమితంగా ఆశీర్వదించబడి గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక.
Show more...
2 months ago
1 hour 3 minutes

The New City Church Podcast - Telugu
The Parable of the Wheat and the Tares -గోధుమలు మరియు గురుగుల యొక్క ఉపమానము
గురుగుల మధ్యలో కూడా గోధుమ వలె పెరగండి! రూపాంతరం చెందిన వ్యక్తులు లోకపు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో, దేవుని రాజ్యాన్ని ప్రతిబింబించే గోధుమలు గురుగులు అనే ఉపమానము ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనకు ఈ వర్తమానంలో చూపిస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా మీ కోరికలు, పనులు మరియు మీ జీవితము ఇతరులను ప్రభావితం చేసిన విధానాన్ని గురించి ఒక సారి ఆలోచించండి. మంచి మార్పును తీసుకువచ్చే గోధుమ వలె, చీకటిలో వెలుగుగా ప్రకాశించడానికి మీ జీవితములో మూడు తక్షణ చర్యలను ఇప్పుడే తీసుకోండి.  మీరు సరైన నేలలో ఇష్టపూర్వకంగా నాటబడిన విత్తనంగా ఉండి, దేవుని మహిమ కోసం శాశ్వత ప్రభావాన్ని చూపుదురు గాక!
Show more...
2 months ago
1 hour 17 minutes

The New City Church Podcast - Telugu
The Grace to Manifest the Glory of God! - దేవుని మహిమను ప్రత్యక్షపరచుటకు కృప
అర్థవంతమైన విధానాల్లో, లోకము గమనించునట్లు దేవుని మహిమను ప్రతిబింబించగలిగే దైవికమైన కృపను ఎలా పొందుకోవాలో ఈ పాడ్కాస్ట్ ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు విశ్వాసులను బలపరుస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమార్థమై మీరు అధికముగా ఫలించుటకున్న దైవిక క్రమాన్ని పాటించుటకు కట్టుబడియుండి, తద్వారా క్రీస్తు రక్షణ కృప వైపునకు ప్రజలను త్రిప్పుతారని మా ప్రార్థన.  దేవుని మహిమను కనపరచుటకు మీరు ఏర్పరచబడ్డారు. ఆ మహిమలో నడుస్తూ ఉండండి!
Show more...
3 months ago
1 hour 10 minutes

The New City Church Podcast - Telugu
Still I Rise - నిలిచెదను (Pastor Arpitha Komanapalli)
గాయపు మచ్చలు ఎంత లోతున్నా - నిరీక్షణ అంత కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది.  బాధపరచబడ్డారా? తిరస్కరించబడ్డారా? అలక్ష్యం చేయబడ్డారా? స్వస్థత, నిరీక్షణ, ఓదార్పునిచ్చే పాస్టర్ అర్పిత కొమానపల్లి గారి ఈ వర్తమానాన్ని వినండి. మీ గాయాలను తన మహిమకు నిదర్శంగా మార్చుటకు దేవుడు ఒక వజ్రము వలె ఎలా మిమ్మల్ని ప్రేమతో రూపించి మలచి, మెరుగుపరుస్తాడో తెలుసుకోండి.  మీ బాధలను అధిగమించి, దేవుని ప్రియమైన బిడ్డగా మీకున్న గుర్తింపును స్వీకరించి, బలంగా నిలిచి, నూతన బలం మరియు ధైర్యంతో నడుస్తూ ఉందురు గాక. యేసు నామంలో, ఆమేన్!
Show more...
3 months ago
1 hour 34 minutes

The New City Church Podcast - Telugu
The Glory of God (Bilingual)
The Glory of God, The Victory of All In this powerful sermon, Pastor Benjamin Komanapalli Jr. talks about the privilege and importance of manifesting God’s glory to see real change in the world around us.  As you listen, we pray that you position yourself on the rock of Jesus and take on the responsibility of showing God’s glory in and through your life. May your life be filled with the glory of God. In Jesus' name, Amen! దేవుని మహిమ, మనందరి విజయము మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిజమైన మార్పును చూచుటకు దేవుని మహిమను మనము కనబరచే ఆధిక్యత మరియు ప్రాముఖ్యతను గురించి ఈ శక్తివంతమైన వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధిస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా, క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని మీరు సరియైన స్థానంలో ఉంచుకొని, మీ జీవితాలలో, జీవితాల ద్వారా దేవుని మహిమను చూపే బాధ్యతను తీసుకుంటారని మా ప్రార్థన.  మీ జీవితాలు దేవుని మహిమ చేత నింపబడును గాక. యేసు నామములో, ఆమేన్!
Show more...
3 months ago
1 hour 5 minutes

The New City Church Podcast - Telugu
The Path to Divine Destiny -
మీకై ఉన్న దైవిక గమ్యాన్ని చేరుకొనుట: నిజమైన విజయానికి యాత్ర! ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దైవిక గమ్యానికి అర్థం, దానిని చేరుకొనే మార్గాలు, మీకై ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని కనుగొన్న తరువాత చేయాల్సిన పనులను గురించి  ఎంతో స్ఫూర్తిదాయకమైన వర్తమానాన్ని అందిస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా దేవుడు మీకై ఉద్దేశించిన సంగతులు నిరీక్షణ, సమాధానం, మంచి భవిష్యత్తు గురించినవై ఉన్నాయనే సత్యంలో మీరు వేరుపారాలని మా ప్రార్థన! నిజమైన విజయాన్ని చేరుకొనులాగున దేవుని వాక్యానికి మీ జీవితమంతా విధేయత చూపుచు నడిపింపబడుదురు గాక. యేసు నామములో, ఆమేన్!
Show more...
3 months ago
1 hour 7 minutes

The New City Church Podcast - Telugu
How to fulfill God's Will for your Life? - మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి?
విధేయతతో నడవడం: దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడం ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుట ద్వారా మనమెలా దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చగలమో తెలుపుతున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని సూచనలు భారమైనవి కాదు కానీ, నీ మంచి కొరకే, నీ గమ్యానికి చేర్చే దారి అని నీవు గ్రహించాలని మా ప్రార్థన.  నీవు దేవుని సూచనలను పాటిస్తూ ఉండగా, ఆయన ఆశీర్వాదం నీతో పాటు వెళ్తూ, నీకు స్థిరమైన విజయాన్ని, దేవునికి మహిమను తెచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!
Show more...
3 months ago
1 hour 12 minutes

The New City Church Podcast - Telugu
Discovering God's Plan for your Life - మీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుట
దేవుని ప్రణాళికను తెలుసుకో - నీవెంతో గొప్ప సఫలతను చూస్తావు.  ఈ సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుటకు వివిధ మార్గాలను తెలుపుతున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, మీకై దేవునికున్న  ప్రణాళికను నమ్ముటకు ప్రేరేపించబడి,  విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు ప్రోత్సాహపరచబడాలని మా ప్రార్థన. మిమ్మును మీరు సరైన స్థలములో, సరైన సమయములో కనుగొని, మీ దైవికమైన గమ్యాన్ని చేరుకొందురు గాక!
Show more...
4 months ago
1 hour 11 minutes

The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast - Telugu with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Website: https://www.newcity.in